img Leseprobe Leseprobe

Naanna Enduko Venakabaddaadu

Prakash Naidu Panasakarla

EPUB
ca. 7,49

Kasturi Vijayam img Link Publisher

Belletristik / Lyrik, Dramatik

Beschreibung

ఒక్క కవితతో 'జగత్ప్రసిద్ధుడై' పోయిన పనసకర్ల ప్రకాశ్ నాయుడు- కొత్త కవితా సంకలనం "నాన్న ఎందుకో వెనకబడ్డాడు". ఈ కవితా సంకలనంలో... ప్రతి కవితా... మళ్ళీ చెప్తున్నా... ప్రతీ కవితలోనూ... ఏదో ఆర్తి, ఏదో ఆవేదన, ఏదో మెరుపు, ఏదో చమత్కారం... ఏ కవితనీ తీసిపారేయడానికి వీల్లేని విధంగా రాశాడు... కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి... ఇంత బాగా ఎలా రాయగలిగాడా అని!..

శివోహం

(తనికెళ్ళ భరణి)

సినీ రచయిత, నటుడు, దర్శకుడు


------------------------------------


నాన్న ఎందుకో వెనకబడ్డాడు' అనేది శీర్షికా కవిత మరియు పుస్తకం పేరు. ఈ బరువైన కవితలను చివరిదాకా ఊపిరి బిగపట్టుకుని చదవక తప్పదు. ఈ రచనలో కవితాత్మకత, మానవత, దేశీయత ముప్పేటగా అల్లుకపోయినది. ప్రకాశ్ మనసు ఒక అనుబంధాల పేటిక, ప్రేమల వాటిక. జిలేబీని ముట్టుకుంటే రసం అంటినట్టు ఏ కవితను తడిమినా అదొక తీపి సముద్రం. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో జీవన కోణాలను అన్వేషిస్తున్నాడు. కవిత్వంలో లాగా అక్కడ కూడా భావ సిద్ధిని పొందాలని, విజయాలు సాధ్యం కావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను.


డా॥ ఎన్. గోపి

Weitere Titel in dieser Kategorie

Kundenbewertungen

Schlagwörter

Kasturi Vijayam, Tanikella Bharani, Telugu Poetry