img Leseprobe Leseprobe

Everest In Mind (TELUGU)

Sudheer Reddy Pamireddy

EPUB
ca. 4,49

Kasturi Vijayam img Link Publisher

Ratgeber / Natur

Beschreibung

'మాలావత్ పూర్ణ', అతి తక్కువమంది ప్రయాణించిన మార్గాన్ని తన లక్ష్యంగా ఎంచుకుంది. అయితే, ఇలాంటి గొప్ప మార్గంలో ప్రయాణం చేసిన వాళ్లలో పూర్ణ మొదటి మనిషి కాదు, అలాగే ఆఖరి మనిషీ కాదు. మరి ఎందుకు ఈ ప్రయాణాన్ని విలక్షణంగా భావించాలి? ఈ మార్గంలో నిజానికి ఏం సాధించింది?, ఆమె వయస్సుకు కీర్తి మరియు గౌరవం ఎంతవరకు అవసరం?, జీవితంలో తన లక్ష్యమేమిటి?, తనని ప్రోత్సహిస్తూ, తన చుట్టూ ఉన్నది ఎవరు?, ఎందుకు?, పూర్ణ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?

''కొన్ని లక్షల మందిలో అవకాశం మన గుమ్మం తొక్కింది. నాకు సమానత్వం ఎలుగెత్తి చూపే అవకాశం వచ్చింది. మీరు నన్ను మనసార ఆశ్వీరదించి పంపండి. మీ ఆశీస్సులతో క్షేమంగా తిరిగి వస్తాను. దయచేసి నన్ను పంపండి. నేను వెళతాను'..ఈ మాటలు ఎవరివో కాదు 13 ఏండ్ల మాలావత్ పూర్ణ పలికినవి. తాను వెళ్ళేదెక్కడికో పాఠశాలకో, విదేశాల్లో విహారయాత్రకో కాదు; ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి! తరతరాలుగా తన జాతి ఏమీ సాధించలేదంటే, తాను సాధించి చూపించడానికి! విజయం సాధించడానికి పట్టుదల, తెగువ కావాలి తప్ప కుల, మతం, వర్గ, లింగ భేదాలు కావని నిరూపించడానికి! తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడిన అత్యంత పేదరికంతో జీవించే ఒక గిరిజన యువతి విజయగాథే ఎవరెస్ట్ ఇన్ మైండ్

ఎవరెస్ట్ శిఖర ప్రయాణమంటే, శతాధిక ప్రాణాంతక ఇబ్బందులు ఎదుర్కొంటూ, బ్రతుకే ప్రమాదములో పడుతుందని తెలిసినా ముందుకు సాగడం. శిఖరం దగ్గర మనుగడ సాగించడం అంత సులభం కాదు. 8,849 మీటర్ల ఎత్తులో గాలి పీడనం 30శాతానికి పడిపోతుంది. వీచే గాలులకు తట్టుకోవడం మరొక పెద్ద సవాలు.

Weitere Titel von diesem Autor
Weitere Titel in dieser Kategorie
Cover Everest In Mind (TELUGU)
Sudheer Reddy Pamireddy

Kundenbewertungen

Schlagwörter

Insipirational, YoungestGirl, Mountaineers, Poorna, Everest, Malavath, RSP, Swearoes, Worlds Youngest girl to climb Mount Everest, Motivation